: శ్రీకాళహస్తి, అమలాపురం, రాపూరులో భారీ వర్షం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది అత్యధిక వర్షపాతం. అమలాపురం, రాపూరులో 8 సెం.మీ. వర్షం కురిసింది. ఎలమంచిలిలో 6 సెం.మీ, వెంకటగిరి, తడలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.