: పార్లమెంటు సమావేశాల గడువు పెంచే అవకాశం?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల గడువు తేదీలను కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జులై 7న ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 14తో ముగియనున్నాయి. అయితే, ఇంకా కొన్ని ముఖ్యమైన బిల్లులపై సభలో చర్చ జరిపి చట్టరూపం తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమావేశాలను మరికొన్ని రోజులు కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీమా రంగంలో ఎఫ్ డీఐల పెంపుపై చట్ట సవరణ బిల్లు, అటు కోర్టుల్లో జడ్జిల నియామకం విషయంలో కొన్ని మార్పులు చేసే విషయంపై కొత్త ప్రతిపాదనను కేంద్రం తీసుకురానుందట.

More Telugu News