: ఎర్రబెల్లికి ఎస్కార్ట్ తొలగించిన సర్కార్... గన్ మెన్లను కూడా వెనక్కిపంపిన ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఆయనకు రక్షణగా ఉన్న ఎస్కార్ట్ ను టీ సర్కార్ తొలగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎర్రబెల్లి చాలా కోపంగా ఉన్నారు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపినప్పటికీ... తెలంగాణ సర్కార్ తనకు ఎస్కార్ట్ తొలగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఆయన తన గన్ మెన్లను కూడా వెనక్కి పంపించేశారు. కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తన ఎస్కార్ట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.