: ప్రజల కోరిక మేరకే ఛానళ్లను ప్రసారం చేస్తాం: ఎంఎస్ఓ సంఘం
ప్రజల కోరిక మేరకే తెలంగాణ రాష్ట్రంలో టీవీ ఛానళ్లను ప్రసారం చేస్తామని ఎంఎస్ఓల సంఘం తేల్చి చెప్పింది. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. ఎంఎస్ఓలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని ఎంఎస్ఓ సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అన్నారు. త్వరలోనే కేంద్ర సమాచార శాఖ మంత్రిని కలిసి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని ఆయన చెప్పారు.