: అర్ధరాత్రి అదుర్స్ అంటున్న హైదరాబాద్ కుర్రకారు

పనులు పూర్తి చేసుకుని రాత్రి పదింటికల్లా పడుకోవడం ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు హైదరాబాదులో పరిస్థితి మారింది. అర్థరాత్రి దాటినా యువతరం నిద్రపోవడం లేదు. మిడ్ నైట్ మజాయే వేరు అని యూత్ అంటోంది. రాత్రి వేళల్లో ఫ్రెండ్స్ తో కబుర్లు, బైక్ పై చక్కర్లు కొట్టడం ఇప్పుడు సాధారణంగా మారింది. చల్లని వాతావరణంలో వేడి వేడిగా దొరికే టిఫిన్ తినడం ఓ మధురానుభూతి అని హైదరాబాదీలు అంటున్నారు. కంపెనీలలో నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారి కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మైత్రీవనం, యూసుఫ్ గూడ, పంజాగుట్ట... ఇలా చాలా చోట్ల టిఫిన్స్ రాత్రంతా దొరుకుతున్నాయి. ఇడ్లీ, దోసె, మైసూర్ బజ్జీలను వేడివేడిగా అందిస్తుండటంతో ఈ మిడ్ నైట్ టిఫిన్స్ సెంటర్స్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.

More Telugu News