: ప్రపంచ సూచీల్లో భారత విస్కీ బ్రాండ్ల హవా
ఇది నిజంగా గర్వించదగ్గ అంశమేనా..? భారత విస్కీ బ్రాండ్లు ప్రపంచ మద్య వినిమయ సూచీల్లో హల్ చల్ చేస్తున్నాయట. డ్రింక్స్ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేస్తున్న విస్కీ బ్రాండ్లలో 7 ఇండియన్ బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో రాడికో ఖైతాన్ తయారీ క్రౌన్ బ్రాండ్ 75 శాతం అభివృద్ధి నమోదు చేయగా, ఇంపీరియల్ బ్లూ (పెర్నార్డ్ రికార్డ్), ఆఫీసర్స్ చాయిస్ (అల్లైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్), హేవార్డ్స్ ఫైన్ (యునైటెడ్ స్పిరిట్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా మెక్ డోవెల్స్ నెం.1, రాయల్ చాలెంజ్, రాయల్ స్టాగ్ వంటి బ్రాండ్లు కూడా జాబితాలో చోటు సంపాదించాయి. గతేడాది అమ్మకాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.