: అక్కడ ప్రతి గ్రామంలోనూ హెచ్ఐవీ రోగులు

దేశంలో మునుపటితో పోల్చితే ఎయిడ్స్ వ్యాప్తి గణనీయంగా తగ్గినట్టే భావించాలి. కానీ, గోవాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రతి గ్రామంలోనూ హెచ్ఐవీ పీడితులున్నారని సాక్షాత్తూ గోవా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రకటించారు. రాష్ట్రం మొత్తమ్మీద 15,000 మంది హెచ్ఐవీ రోగగ్రస్తులు ఉన్నారని, దానర్థం, రాష్ట్ర జనాభాలో 1 శాతం ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్ బారినపడినట్టని ఆయన వివరించారు. హెచ్ఐవీ రోగి లేని ఒక్క గ్రామం కూడా గోవాలో లేదని ఈ మేరకు అసెంబ్లీకి తెలిపారు. బీజేపీ సభ్యుడు నీలేశ్ కాబ్రాల్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి పైవివరాలు వెల్లడించారు.

More Telugu News