: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి యేల్ యూనివర్శిటీ డ్రిగ్రీ సర్టిఫికేట్
కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ అమెరికాలోని యేల్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ సర్టిఫికేట్ పొందినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యేల్ లో ఆరు రోజుల పాటు జరిగిన నాయకత్వ కోర్సులో మంత్రి స్మృతి పాల్గొన్నందుకుగానూ ఈ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిపింది. "యేల్ లో జరిగిన నాయకత్వ కోర్సు కార్యక్రమంలో భాగంగా భారత్ నుంచి వెళ్లిన పలువురు ఎంపీల్లో ఇరానీ కూడా ఉన్నారు. ఇందుకుగానూ ఆమెకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు యేల్ తెలిపింది" అని హెచ్ఆర్ డీ మంత్రిత్వ శాఖ వివరించింది.
అంతకుముందు తాను యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందానని న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియాటుడే ఉమన్ సమ్మిట్-2014'లో స్మృతి వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ ప్రశ్నించడంతో హెచ్ఆర్ డీ పైవిధంగా తెలిపింది.