: కడప జిల్లాలో నేడు పర్యటించనున్న శివరామకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి వినతులు, అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనుంది. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఈ నెలాఖరులోగా తుది నివేదికను సమర్పిస్తామని కమిటీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

More Telugu News