: శుభప్రదం కాని రోజుల్లో బస్సులు తగ్గించేద్దాం: ఆర్టీసీ

ప్రజలు అశుభంగా భావించే రోజుల్లో బస్సులను గణనీయంగా తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మంగళవారం, అమావాస్య, పాడ్యమి లాంటి అమంగళకర రోజుల్లో ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉంటోందని ఆర్టీసీ నిర్వహించిన ఓ స్టడీలో తేలింది. ఈ రోజుల్లో ప్రయాణికులు చాలా తక్కువగా బస్సులు ఎక్కడం వల్ల... ఆర్టీసీకి భారీ నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. శుభప్రదం కాని రోజుల్లో బస్సుల ట్రిప్పులు బాగా తగ్గించి... పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే సీజన్ లో... పండగల టైమ్ లో ప్రస్తుతం నడుపుతున్న వాటి కంటే ఎక్కువగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. నష్టాల నివారణకు ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలలో ఇది ఓ భాగం మాత్రమే అని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News