: విద్యుత్ షాక్ తో ముగ్గురు కార్మికుల మృతి

చిత్తూరు జిల్లా పాకాల మండలం శేషాపురం వద్ద విద్యుత్ షాక్ తో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మరణించారు. మృతులను ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News