: ప్రతి విషయంపై మెలిక పెట్టడం కేసీఆర్ కు మంచిది కాదు: దేవినేని

టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని అంశాలకూ ఓకే చెప్పిన కేసీఆర్, ఇప్పుడు తిరగబడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి హైదరాబాదుపై గవర్నర్ అధికారాల వరకు... ప్రతి విషయంపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఇంత రభస చేస్తున్న వ్యక్తి... అప్పుడెందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్రతి విషయంపై మెలిక పెట్టడం కేసీఆర్ కు మంచిది కాదని... పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

More Telugu News