: సీఎంతో చర్చించకుండా గవర్నర్ కు అధికారం ఎలా ఇస్తారు?: కడియం

హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలు అప్పజెప్పడాన్ని టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి తప్పుబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధానాన్ని తెలంగాణలో మాత్రమే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిని అయినా సంప్రదించకుండా గవర్నర్ కు అధికారాలు ఎలా కట్టబెడతారని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాదుపై గవర్నర్ గిరీ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

More Telugu News