: సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తున్న మహేష్ బాబు 'ఆగడు' రెండో టీజర్

పుట్టిన రోజు వేడుకల సందర్భంగా టీజర్లను విడుదల చేసి అభిమానుల ఆసక్తిని మరింత హైప్ కి తీసుకెళ్లడంలో టాలీవుడ్ దర్శకుల తరువాతే ఎవరైనా అని చెప్పుకోవాలి. నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతని తాజా సినిమా 'ఆగడు' రెండో టీజర్ ను విడుదల చేశాడు డైరెక్టర్ శీను వైట్ల. "డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట... అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇవ్వడానికి నేనేమైనా రైటర్నా... ఫైటర్ని" అంటూ తనదైన శైలిలో మహేష్ బాబు చెప్పిన డైలాగుతో ‘ఆగడు’ టీజర్ సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందుతోంది.

More Telugu News