: లోక్ సభలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కే ఇవ్వాలన్న పిల్ కొట్టివేత
లోక్ సభలో ప్రతిపక్ష హోదా కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని న్యాయవాది ఎంఎల్ శర్మ పిల్ రూపంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. సభలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరాడు. పరిశీలించిన చీఫీ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్ లపై విచారించి ఎంటర్ టైన్ చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 32 ప్రకారం రాజకీయ సమస్యలను నిర్ణయించడానికి తామిక్కడ కూర్చోలేదన్న ధర్మాసనం, సభలో స్పీకర్ ఇచ్చిన రూలింగ్ కు సవరణగా న్యాయ సమీక్ష కుదరదని చెప్పింది.