: మొగల్ పురాలో అమ్మవారి బంగారు విగ్రహం చోరీ
హైదరాబాదులోని మొగల్ పురా అమ్మవారి ఆలయంలో బంగారు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. విగ్రహం సుమారు నాలుగువందల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. అటు వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.