: విశాఖపట్నం బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
జిల్లాల పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన చంద్రబాబు... నేడు విశాఖ బయల్దేరారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, నేతలతో చర్చిస్తారు. నిన్న రాత్రి విజయవాడలోనే బస చేసిన చంద్రబాబు కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ బయల్దేరారు.