: 'పీకే' న్యూడ్ పోస్టర్ పై అమీర్ ఖాన్ స్పందన
తాను నటిస్తున్న 'పీకే' చిత్రం ఫస్ట్ లుక్ న్యూడ్ పోస్టర్ పై దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగుతుండటంతో నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. పబ్లిసిటీ కోసం తన న్యూడ్ పోస్టర్ ను విడుదల చేయలేదన్నాడు. అదొక కళ అని, సినిమా కథను పోస్టర్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నాడు. సినిమా చూసినప్పుడే పోస్టర్ అలా రూపొందించడానికి గల కారణాన్ని అందరూ అర్థం చేసుకుంటారని అమీర్ చెప్పాడు. పీకే చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగా ఉంటాయని, అందుకే తాను అతనికి పెద్ద అభిమానినని తెలిపాడు. కాగా, ఈ పోస్టర్ వివాదంపై ఓ న్యాయవాది పిటిషన్ వేయగా నేడు విచారణకు రానుంది.