: టీఎస్ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: డీజీపీ అనురాగ్ శర్మ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 3,600 డ్రైవర్లు, 1500ల ట్రాఫిక్ హోంగార్డుల కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. టీఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖకు బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించిందని, దేశంలో ఏ రాష్ట్రం కూడా పోలీసు వ్యవస్థకు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించదని చెప్పారు. హైదరాబాదులో పోలీసు సిస్టమ్ లో పాల్గొనే సిబ్బంది కోసం సిస్కోలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ ఈరోజు ప్రారంభించారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందుకోసం బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

More Telugu News