: కోహ్లి పేలవ ఫామ్ కు... బీసీసీఐ నిర్ణయమే కారణం

ఇంగ్లండ్ సిరీస్ లో మూడు టెస్టుల్లో కేవలం 101 పరుగులు చేసి కెరీర్ లోనే తొలిసారి పేలవ ఫామ్ తో కోహ్లి సతమతమవుతున్నాడు. ఈ సిరీస్ లో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి వైఫల్యానికి బీసీసీఐ కారణమని క్రికెట్ విమర్శకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా... వారి వాదనకు క్రీడాభిమానులు సైతం వంత పాడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. అయితే కోహ్లి ఇంగ్లండ్ టూర్ కు తనతో పాటు అనుష్కశర్మను తీసుకువెళతానంటే... ఏమాత్రం ఆలస్యం లేకుండా... ఆలోచన చేయకుండా బీసీసీఐ అనుమతి ఇచ్చింది. బీసీసీఐ అనుమతి కారణంగా ఇంగ్లండ్ టూర్ లో అనుష్కశర్మతో కలిసి కోహ్లి హాయిగా షికార్లు చేస్తున్నాడు. అనుష్కశర్మతో ప్రేమకలాపాల్లో మునిగిపోవడం వల్లే... కోహ్లి ఇంగ్లండ్ టూర్ లో రాణించలేకపోతున్నాడని క్రీడా పరిశీలకులతో పాటు అభిమానులు కూడా వాపోతున్నారు. కీలకమైన ఇంగ్లండ్ టూర్ లో కోహ్లితో పాటు ఉండడానికి అనుష్కశర్మకు ఎలా అనుమతి ఇచ్చారని వారు బీసీసీఐపై మండిపడుతున్నారు.

More Telugu News