: చంద్రబాబు, కేసీఆర్ తో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఏపీలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి టాటా గ్రూప్ ముందుకొచ్చింది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి సహకారం అందిస్తామని మిస్త్రీ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సైరన్ మిస్త్రీ సమావేశమయ్యారు.