: మోడీ నియంత కాదు, మతతత్వవాది అంతకన్నా కాదు: రాజ్ నాథ్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మద్దతుగా నిలిచారు. ప్రధానిపై రాహుల్ గాంధీ పరోక్ష వ్యాఖ్యల పట్ల రాజ్ నాథ్ స్పందించారు. మోడీ నియంత కాదని, మతతత్వవాది అంతకన్నా కాదని స్పష్టం చేశారు. ఈ విషయం దేశమంతటికీ తెలుసని రాజ్ నాథ్ పేర్కొన్నారు. మోడీ నియంత, మతతత్వవాది అయి ఉంటే, దేశ ప్రజలు ఇంతపెద్ద విజయాన్ని కట్టబెట్టేవారు కాదని అన్నారు. లోక్ సభలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని, అక్కడ కేవలం ఒక్క గొంతు మాత్రమే వినిపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. సభలో జరిగే విషయాలు స్పీకర్ చూసుకుంటారని రాజ్ నాథ్ అన్నారు.

More Telugu News