: ఓయూలో మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాదు ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఓయూ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో... బీఈడీ కళాశాల సమీపంలో వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించవద్దంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News