: నీటిని పొదుపు చేయాలంటే వెజిటేరియన్లుగా మారండి..!
మాంసాహారం కారణంగా ప్రపంచంలో నీటి వ్యయం ఎక్కువగా జరుగుతోందని పరిశోధకులు అంటున్నారు. మాంసంతో తయారయ్యే వంటకాలకు నీటి అవసరం అధికమని వారు తెలిపారు. తక్కువ మాంసం వినియోగం ద్వారా పొడి ప్రాంతాల్లో నీటి వనరులను కాపాడుకోవచ్చని ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్శిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రజలు వెజిటేరియన్లుగా మారితే నీటి వనరుల వినియోగం పెంచాల్సిన పని లేకుండానే అదనంగా వంద కోట్ల మందికి పైగా ఆహార భద్రత కల్పించడానికి వీలవుతుందట.