: నా వాడు నా తోడుంటే పతకం రాదా?: దీపిక పల్లికల్
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి స్వర్ణపతకం సాధించి చరిత్ర సృష్టించిన జ్యోత్స్న చిన్నప్ప, దీపిక పల్లికల్ జోడిని అందరూ అభినందిస్తున్నారు. అయితే దీపిక గురించి కాస్త ఎక్కువగానే చర్చ జరుగుతోంది. దీపిక పల్లికల్ మ్యాచ్ లో సమర్థవంతంగా, సమయస్ఫూర్తిగా ఆడి పాయింట్లను చకచకా సాధించింది. అందుకు కారణం ఒకటుంది. ఆమె మానసిక దృఢత్వాన్ని ఓ వ్యక్తి పెంచారు. అతనే ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్! వీరిద్దరూ ఫిట్ నెస్ పాఠాలు ఒక్కరి దగ్గరే నేర్చుకుంటున్నారు. ఫిట్ నెస్ లో టీమిండియాలో దినేష్ కార్తీక్ ను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. కీపర్ బ్యాట్స్ మన్ అయిన దినేష్ కార్తిక్ అత్యుత్తమ ఫీల్డర్ కూడా.
దినేష్ కార్తీక్ కి, దీపిక పల్లికల్ సంబంధం ఏంటని అనుకుంటున్నారా? దీపిక పల్లికల్ ను దినేష్ కార్తీక్ వలచిన వరుడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరికి నిశ్చితార్ధం కూడా అయింది. 'నా వాడు నాతోడుండగా పతకం సాధించా'నని స్వర్ణం సాధించిన తరువాత దీపిక ట్వీట్ చేసింది. తన కాబోయే భార్య సాధించిన విజయం పట్ల ఎంతో గర్విస్తున్నానని దినేష్ కార్తీక్ కూడా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను ఢిల్లీడేర్ డెవిల్స్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రీ ట్వీట్ చేయడం విశేషం!