: ఒకే వేదికను పంచుకున్న పాత స్నేహితులు

ఒకప్పుడు ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో వారిద్దరూ ప్రాణమిత్రులు. ఉన్నట్లుండి అమర్ పై వేటు పడటంతో అప్పటినుంచీ రాజకీయ మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు. ఆ తర్వాత వారెన్నడూ కలుసుకోలేదు. అలా దాదాపు నాలుగేళ్ల తర్వాత కు ఓ కార్యక్రమం కోసం వారు కలిశారు. లక్నోలో ఈ రోజు జనశ్వేర్ మిశ్రా పార్క్ ప్రారంభోత్సవానికి ములాయం, అమర్ హాజరయ్యారు. అయితే, కార్యక్రమంలో ఒకరినొకరు పలకరించుకోలేదు, కనీసం ఒకరినొకరు చూసుకోలేదు కూడా. ఈ సందర్భంగా ఎంపీ అమర్ సింగ్ మాట్లాడుతూ, తాను ములాయంవాదినని, సమాజ్ వాదిని కాననీ అన్నారు. ప్రస్తుతం తన వ్యక్తిగత సామర్ధ్యం మీద ఈ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నానని, జనశ్వేర్ మిశ్రా భావజాలం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. 1996లో సమాజ్ వాదీ పార్టీలో చేరిన అమర్ సింగ్ 2010లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

More Telugu News