: కాంగ్రెస్ లో నాన్న తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు: మన్మోహన్ కుమార్తె దమన్

'స్ట్రిక్ట్ లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్' పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన పుస్తకం పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్లదిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తండ్రికి మద్దతుగా తనదైన వాదన వినిపించారు. రాజకీయాలకు తన తండ్రి సరిపోరని భావించడం లేదని దమన్ అన్నారు. అయితే, దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో సొంతపార్టీ కాంగ్రెస్ లోనే తన తండ్రి (మన్మోహన్) తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పారు. అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి ఓవర్ నైట్ లో ఆర్థికమంత్రిని చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆయనకు (మన్మోహన్) నెల గడువు మాత్రమే ఉందనే అన్నారు. పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమీ చేయలేకపోయేవారని, ఆయనే పూర్తి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే తన తండ్రి నమ్మలేకపోయారన్నారు. ఇలా మన్మోహన్ కు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలను కుమార్తె ఆ పుస్తకంలో సవివరంగా తెలిపారు.

More Telugu News