: ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీం తీర్పును స్వాగతించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంసెట్ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా సహజన్యాయ సూత్రాలను కాపాడిందని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు న్యాయం జరిగినట్లయిందని అన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ తొందరగా పూర్తయ్యేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News