: వరుణ్ గాంధీని యూపీ సీఎంగా చూడాలనుకుంటున్న మేనకా!


రెండుసార్లు ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా చేస్తున్న మేనకా గాంధీ ఇప్పుడు కుమారుడు వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్ పై తెగ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు విడతల ఎంపీగా గెలిచిన తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం ఫిలిబిత్ లో ఓ బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని, అంతేకాక వరుణ్ గాంధీ ఆ రాష్ట్ర పాలకుడిగా ఉంటే ఇంకా బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సర్కారు హయాంలో యూపీలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతోందని వ్యాఖ్యానించిన క్రమంలో మేనక పైవిధంగా మాట్లాడారు. వరుణ్ చాలా బాగా పరిపాలిస్తాడని, రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి, చాలా చాకచక్యంగా పరిపాలించగలడని కితాబు ఇచ్చుకున్నారు. ఈ మాటలపై యూపీ బీజేపీ అధినేత లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ స్పందిస్తూ, ఇది కేవలం (వరుణ్ ముఖ్యమంత్రి కావడం) మేనకా వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అటు తల్లి మాటలపై వరుణ్ స్పందిస్తూ, ఇది తన తల్లి నిర్ణయం కాదని, స్పష్టమైన మీడియా నివేదిక అని అన్నారు.

  • Loading...

More Telugu News