: గుంటూరులో 4500 కోట్ల పెట్టుబడి పెడుతున్న పాన్ పసిఫిక్ కంపెనీ
ఆంధ్రప్రదేశ్ లో 4500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన పాన్ పసిఫిక్ కంపెనీ ముందుకు వచ్చింది. రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ సీఈవో మైకేల్ రోజన్ స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులన్నీ ఏపీ రాజధానిగా పేర్కొంటున్న గుంటూరులోనే పెడతామని ఆయన వెల్లడించారు.