: జడేజా స్ట్రైక్ బౌలరా..?: ధోనీ నిర్ణయాన్ని ప్రశ్నించిన ప్రసన్న

రవీంద్ర జడేజాను ప్రధాన బౌలర్ గా కెప్టెన్ ధోనీ పరిగణిస్తుండడాన్ని మాజీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న తప్పుబట్టారు. జడేజాను పూర్తి స్థాయి స్పిన్నర్ కోటాలో జట్టులోకి తీసుకోవడం దారుణమైన నిర్ణయమని ప్రసన్న అభిప్రాయపడ్డారు. జడేజాను పార్ట్ టైమర్ గానే ఉపయోగించుకోవాలని, టెస్టుల్లో అతనేమీ వికెట్ టేకర్ కాదని పేర్కొన్నాడు. అశ్విన్ ను జట్టులోకి తీసుకుని, అతనికి సపోర్టింగ్ గానే జడేజాను ఉపయోగించుకోవాలని ఈ దిగ్గజ స్పిన్నర్ సూచించారు. జడేజా ఇంగ్లండ్ తో మూడు టెస్టుల్లో 142.3 ఓవర్లు విసిరి కేవలం 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ గణాంకాలపై వ్యాఖ్యానిస్తూ... సగటున 100 బంతులకో వికెట్ తీసుకున్నట్టని, అంత వ్యవధి ఇవ్వడమంటే బ్యాట్స్ మన్ కు నిలదొక్కుకునే అవకాశం ఇచ్చినట్టేనని ప్రసన్న విశ్లేషించారు.

More Telugu News