: అటు చూస్తే చంద్రబాబు, ఇటు చూస్తే సొంతపార్టీ సీఎం..! ఇరకాటంలో మోడీ సర్కారు

జాతీయ క్రీడలు ఎప్పుడు జరపాలన్న దానిపై ఎలాంటి గందరగోళం లేదు, నిర్వహణకు అవసరమైన నిధులకూ కొరతలేదు! ఎక్కడ జరపాలన్న దానిపైనే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. మోడీ సర్కారుకు ఇదో తలనొప్పిగా మారింది. కారణమేమిటంటే... 36వ జాతీయ క్రీడలకు తాము ఆతిథ్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయగా... అంతకుముందే గోవా సీఎం మనోహర్ పారికర్ లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) కూడా క్రీడల విషయమై గోవాతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మిత్రుడు చంద్రబాబు వినతికి సమ్మతి తెలపాలో... అటు సొంతపార్టీ సీఎం మనోహర్ పారికర్ కు మద్దతివ్వాలో తేల్చుకోలేక మోడీ సర్కారు ఇరకాటంలో పడింది.

More Telugu News