: అమిత్ షాను కలవడంతో సీడబ్ల్యూసీ నుంచి బహిష్కరించారు
హర్యానాకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చౌధరీ బీరేందర్ సింగ్ ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నుంచి బహిష్కరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను బీరేందర్ కలిసిన క్రమంలో బహిష్కరణ వేటు పడింది. అంతేకాకుండా, వివరణ ఇవ్వాలంటూ ఆయన్ను ఆదేశించారు. గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కూడా బీరేందర్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీలో అత్యంత కీలకమైన సీడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరే యోచనలో బీరేందర్ సింగ్ ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో, ఆయన అమిత్ షాను కలవడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది.