: విజయవాడకు క్షేమంగా చేరుకున్న నాగాలాండ్ ఇంజినీర్లు

నాగాలాండ్ లో మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లు క్షేమంగా విజయవాడ చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ఇంజినీర్లు ప్రతీశ్ చంద్ర, రఘు విజయవాడ చేరుకున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. నాగాలాండ్ లో నిర్మాణ పనులు చేపట్టిన రత్న కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న వీరిద్దరినీ జులై 27న నాగా మిటిటెంట్లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. మిలిటెంట్లతో కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో వీరిని విడుదల చేశారు.

More Telugu News