: ఏపీలో నేటి నుంచి పాఠశాలల వేళల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అన్ని ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, జడ్పీ పాఠశాలల వేళలు మారనున్నాయి. కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.40దాకా కొనసాగేవి. అలాగే, ఉన్నత పాఠశాలలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు కొనసాగేవి. ఇప్పడు 50 నిమిషాల సమయాన్ని పెంచి అన్ని పాఠశాలలకు ఒకే సమయాన్ని నిర్ణయించారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు అన్ని పాఠశాలలు కొనసాగుతాయి.