: లారీ లోయలో పడిపోయినా... డ్రైవర్, క్లీనర్ సేఫ్
ప్రకాశం జిల్లాలో లారీ, రోడ్డుపై ప్రయాణిస్తూ అదుపుతప్పి 150 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే లారీలో నుంచి మంటలు చెలరేగాయి. గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో లారీ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో డ్రైవరు, క్లీనర్ లారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.