: సఫారీ 'కింగ్' కు కెప్టెన్ల నీరాజనాలు
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెట్ కింగ్ జాక్వెస్ కలిస్ కు సఫారీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్లు నీరాజనం పలికారు. కలిస్ లాంటి వ్యక్తి ఐదు దశాబ్దాలకు ఒకసారే పుడతాడని టెస్టు జట్టు సారథి హషీమ్ ఆమ్లా పేర్కొన్నాడు. కలిస్ సూక్ష్మగ్రాహి అని, నూటికి నూరు శాతం జట్టుకోసం ఆడే వ్యక్తి అని ఆమ్లా కొనియాడాడు. యువతకు కలిస్ ఆదర్శప్రాయుడని అభిప్రాయపడ్డాడు.
డ్రెస్సింగ్ రూంలో కలిస్ లేకపోవడం లోటేనని, ముఖ్యంగా అతని ట్రేడ్ మార్క్ స్లిప్ ఫీల్డింగ్ మిస్సవుతామని విచారం వ్యక్తం చేశాడు. ఇక, వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలీర్స్ మాట్లాడుతూ, కలిస్ అనుభవం జట్టుకు దూరమైందని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు అతడు లేకపోవడం దురదృష్టకరమని అన్నాడు.