: తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి అంగీకరించిన ఛత్తీస్ గఢ్
తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఛత్తీస్ గఢ్ అంగీకారం తెలిపింది. 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ పంపిణీ ఇప్పటికిప్పుడే కాకుండా... 2017నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి దీర్ఘకాలిక విద్యుత్ పంపిణీ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ఒక వారం రోజుల్లో పీపీఏ కుదిరే అవకాశం ఉంది.