: కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రేపటి నుంచి శిక్షణా తరగతులు
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 315 మంది కొత్తగా ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వారందరికీ శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ తరగతుల్లో శాసన ప్రక్రియ, పార్లమెంటులో కమిటీ విధానం, బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పించనున్నారు. పార్లమెంటరీ స్టడీస్ అండ్ ట్రైనింగ్ బ్యూరో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధికారాలు, ఎంపీ లాడ్స్ స్కీమ్ గురించి కూడా తెలపనున్నారు.