: ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తున్న కేజ్రీవాల్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఐదు నెలల తర్వాత ఢిల్లీలో తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేయబోతున్నారు. తిరిగి ఘజియాబాద్ కు దగ్గరలోని కుశంబికి వెళ్లనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిలక్ లేన్ లోని ప్రభుత్వ నివాసం సీ 11/23లో ఉంటున్నారు. అయితే, నెలకే సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీ కుమార్తె చదువుకోసం అక్కడే కొనసాగారు. ఈ క్రమంలో జులై చివరికల్లా ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు అప్పటికే ఆదేశించారు. దాంతో, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అయిన తన భార్య సునీతకు ఘజియాబాద్ లో కేటాయించిన అపార్ట్ మెంట్ కు పిల్లలు, తల్లిదండ్రులతో కలసి మరో రెండు రోజుల్లో వెళ్లనున్నారట.