: అప్పు ఎగ్గొట్టడానికి పోలీసులతో బేరం ఆడాడు!

కాశ్మీర్ కు చెందిన ఓ పాతికేళ్ళ యువకుడు అప్పు ఎగ్గొట్టేందుకు ఏం చేశాడో చూడండి. శ్రీనగర్ నుంచి నేరుగా ముంబయి వచ్చాడు. పోలీసుల ఎదుటకు వెళ్ళి తాను పుణే బాంబు పేలుళ్ళకు పాల్పడ్డానని, దర్యాప్తుకు సహకరించేందుకు వచ్చానని చెప్పాడు. అయితే, ఓ మెలికపెట్టాడు. కొంత డబ్బు ఇస్తేనే సహకరిస్తానని తెలిపాడు. విషయం ఏదో ఆసక్తికరంగా ఉందని పోలీసులు ఇంటరాగేషన్ మొదలు పెడితే అసలు సంగతి బయటికొచ్చింది. అతడి పేరు బషీర్ అహ్మద్ గోగ్లు అని, కాశ్మీర్లో శాలువాలు అమ్ముకుంటూ జీవించేవాడని తెలిసింది. అయితే, అప్పుల బాధ ఎక్కువ కావడం, జైలుకు వెళ్ళాల్సి వస్తుందన్న భయం అతడిని ముంబయి దిశగా నడిపించాయి. ప్రస్తుతం అతడు తమ అదపులో ఉన్నట్టు ముంబయి పోలీసులు కాశ్మీర్లోని అతడి భార్యకు సమాచారం అందించారు.

More Telugu News