: శ్రావణ మాస శోభతో కళకళలాడిన అమ్మవారి ఆలయాలు
శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వరంగల్ జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇవాళ శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో సిద్ధేశ్వర స్వామి, భద్రకాళీ ఆలయం, వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు.