: రాహుల్ మద్దతు కోరిన యూపీఎస్సీ అభ్యర్థులు

సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీ అభ్యర్థుల నిరసన ఢిల్లీలో కొనసాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసిన అభ్యర్థులు తమ డిమాండ్ కు మద్దతు పలకాలని కోరారు. దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించారనీ, తమవైపు ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారనీ వారు మీడియాకు తెలిపారు. పరీక్షలోని ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఇంగ్లిష్ మాట్లాడలేని అభ్యర్థుల పట్ల వివక్ష చూపినట్లేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని పరీక్ష నమూనాలో మార్పులు చేయాలని కోరారు.

More Telugu News