: గాజాలో తక్షణ కాల్పుల విరమణకు ఒబామా పిలుపు
ఇరవై రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే, బేషరతుగా విరమించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఒబామా ఫోన్ చేశారు. ఇదే సమయంలో హమాస్ రాకెట్ దాడులను కూడా ఖండించారు. ఇన్నిరోజుల నుంచి గాజాలో జరిగిన ఘర్షణలో పాలస్తీనా ప్రజల మృతుల సంఖ్య పెరుగుతుండటంపైన ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.