: లంచం తీసుకోకుండా పనిచేస్తానని... ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేశా: ఏపీ మంత్రి
చంద్రబాబు మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. మంత్రిగా లంచం తీసుకోకుండా ప్రజాసేవ చేస్తానని... కైకలూరులోని ఓ ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేశానని ఆయన విలేకరులతో చెప్పారు. ప్రమాణం చేసిన విధంగా తాను నీతి, నిజాయతీలతో కచ్చితంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. కామినేని శ్రీనివాస్ ప్రకటన పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, స్థానిక ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.