: బంగాళాఖాతంలో తుపాన్... పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

రుతుపవనాలు పలకరించి దాదాపు రెండు నెలలైనా ఇంతవరకు సరైన వర్షం లేదు. ఓవైపు చినుకు కోసం ఆకాశం వైపు చూస్తున్న రైతన్న... మరోవైపు అడుగంటిపోయిన జలవనరులతో తీవ్ర స్థాయికి చేరిన తాగునీటి సమస్య. ప్రతిరోజు ఆకాశం మేఘావృతంగానే ఉంటుంది... కానీ, వరుణుడు కరుణించడు. ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్ర ప్రజలకు శుభవార్త. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారింది. ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రానున్న 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.

More Telugu News