: నకిలీ 'స్పైడర్ మ్యాన్'కు అరదండాలు

న్యూయార్క్ మహానగరంలో స్పైడర్ మ్యాన్ వేషంలో ఓ మహిళా యాత్రికురాలిని వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆ టూరిస్టును డబ్బులివ్వాలంటూ స్పైడర్ మ్యాన్ వేషధారి వెంటపడ్డాడు. ఆమె ఒక డాలర్ ఇవ్వగా అతడు నిరాకరించాడు. తనతో ఫొటో తీయించుకోవాలంటే 20 డాలర్లు ఇవ్వాలని, లేదా, 10 డాలర్లైనా ఇవ్వాలని, చివరికి కనీసం 5 డాలర్లైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ పోలీసు అధికారి సదరు వేషగాడిని అడ్డుకున్నారు. దీంతో, స్పైడర్ మ్యాన్ కు కోపం వచ్చింది. వెంటనే ఆ పోలీసు ముఖంపై గుద్దాడు. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసు అధికారులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని జూనియర్ బిషప్ గా గుర్తించారు. అరెస్టును నిరోధించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం, దుష్ప్రవర్తన వంటి అభియోగాలను బిషప్ పై మోపారు న్యూయార్క్ పోలీసులు.

More Telugu News