: జయసుధ ఆవేదన
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలే ఎన్నికల్లో తన ఓటమికి కారణమయ్యాయని నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వాపోయారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపులేదని, యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇకనైనా యూత్ కాంగ్రెస్ కు ఎన్నికలు జరపడం మేలని సూచించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన జయసుధ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పలేదు.