: కాంగ్రెస్ అన్ని విషయాల్లో సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది: వెంకయ్యనాయుడు
కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి బలం సరిపోదని చెప్పినందుకు... అటార్నీ జనరల్ పై కూడా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాపై సభాపతి తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటును అర్ధాంతరంగా వాయిదా వేయలేమని... బీమా, సెబీ, జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ బిల్లులను ప్రవేశపెడతామని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.