: మళ్లీ కల వచ్చింది... భారీ నిధి కోసం తవ్వకాలు ప్రారంభించారు!

ఓ సాధువుకు కల రావడంతో... తొమ్మిది నెలల క్రితం ఉత్తరప్రదేశ్ లో నిధి కోసం భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయానా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పురావస్తు శాఖ తవ్వకాలను చేపట్టింది. అయితే, పిసరంత బంగారాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు అలాంటిదే మరో కార్యక్రమం మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లా ఖైర్పురా గ్రామంలో నిధికోసం తవ్వకాలను చేపట్టారు. గత పది రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. అయితే, నిధి ఉన్నట్టు ఈసారి తొమ్మిది మంది బాలికలకు కల వచ్చిందట. గ్రామం బయట ఓ ప్రదేశంలో దేవత విగ్రహం ఉందని... అక్కడ భారీ ఎత్తున నిధి ఉందని ఆ బాలికలు కలగన్నారట. మరి, ఈసారి తవ్వకాలలో ఏమి బయటపడుతుందో చూడాలి!

More Telugu News